100 MBPS - ఇప్పటి ప్రపంచానికి కనీసం మీకు 100 MBPS ఎందుకు అవసరం అవుతుంది?
Wednesday, Jul 06, 2022 · 10 mins
971
ప్రస్తుత రోజుల్లో ఇంటర్నెట్ స్పీడ్ 100 Mbps ఉండటం చాలా ముఖ్యం. ఏదేమైనా 100 Mbps స్పీడుతో ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటేనే దానిని ఉత్తమమైనదిగా భావిస్తారు. కానీ ఇంటర్నెట్ స్పీడ్ 100 Mbps ఉన్నా కానీ, కొన్నిసార్లు ఉపయోగించే వారికి తక్కువ స్పీడ్ వస్తున్నట్లు అనిపిస్తుంది. ఇంటర్నెట్ స్పీడ్ సరిగ్గా ఉన్నప్పటికీ కూడా వేటి వలన మనకు సరైన అనుభవం కలగదంటే..
ఒకేసారి ఎన్ని డివైస్లు కనెక్ట్ అయి ఉన్నాయి? (ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నాయి.)
ఎంత మంది యూజర్లు Netflix, YouTube వంటి సైట్ల నుంచి వీడియోలను డౌన్లోడ్ చేస్తున్నారు?
ఆన్లైన్ గేమింగ్స్ కొరకు మీరు మీ హోం WiFiని ఉపయోగిస్తున్నారా?
మీరు తరచూ పెద్ద సైజున్న ఫైల్స్ను సెండ్ చేయాలా?
మీరు చాలా త్వరగా 4K వీడియోను డౌన్లోడ్ చేస్తారా? లేదా ఆన్లైన్లో టాస్క్లను కంప్లీట్ చేస్తారా?
మీరు ఏదైనా గేమ్ ఆడుతున్నపుడు కానీ, వెబ్సైట్ను బ్రౌజ్ చేస్తున్నపుడు కానీ మీ ఇంటర్నెట్ స్పీడ్ తక్కువగా ఉంటే మీకు సులభంగా చికాకు వచ్చే అవకాశం ఉంటుంది. మీకు అలా జరుగుతుందా?
మీరు ఎంత స్పీడులో నెట్వర్క్ రావాలని కోరుకుంటున్నారు?
Netflixలో ఫుల్ HD వీడియోను చూసేందుకు దాదాపు 10 Mbps ఇంటర్నెట్ స్పీడ్ అవసరమవుంది. అంతేకాకుండా 4K అల్ట్రా HD వీడియోను వీక్షించేందుకు 25 Mbps స్పీడ్ అవసరమవుతుంది. మీరు కనుక ఒకే సారి పలు డివైస్లను కనెక్ట్ చేస్తే ఎక్కువ స్పీడ్ ఉన్న ఇంటర్నెట్ కనెక్షన్ పెట్టించుకోవాల్సి ఉంటుంది. ఇతర స్ట్రీమింగ్ వెబ్సైట్లయిన YouTube, Twitch లకు కూడా ఇది వర్తిస్తుంది.
మీరు కనుక పలు డివైస్లను కనెక్ట్ చేస్తే ఎక్కువ బ్యాండ్విడ్త్ ఉన్న నెట్ కనెక్షన్ను తీసుకోవాల్సి ఉంటుంది. మీరు 4K వీడియో కంటెంట్ను స్ట్రీమింగ్ చేయాలని భావిస్తే, ఒకటి కన్నా ఎక్కువ పరికరాలను ఒకే సమయంలో కనెక్ట్ చేయడానికి చూస్తే మీరు ఎక్కువ డౌన్లోడ్ స్పీడ్ ఉన్న నెట్వర్క్ను ఎంచుకోవాలి. ఉదాహరణకు 200 Mbps నెట్ స్పీడ్ ఉన్న నెట్వర్క్ను ఎంచుకోవడం వలన ఇది చాలా మంది యూజర్లకు ఉపయోగకరంగా ఉంటుంది.
మీ ఇంటర్నెట్ డిమాండ్ ఎక్కువగా ఉంటే, మీరు గిగా బిట్ కనెక్షన్ను కూడా ఎంచుకోవచ్చు.
100Mbps మంచి డౌన్లోడ్ స్పీడ్ అని మీరు భావిస్తున్నారా?
100 Mbps స్పీడ్ ఉన్న ఇంటర్నెట్ సెకనుకు 12.5 MB డాటాను ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఫైబర్ ఆప్టిక్ ఇంటర్నెట్ కనెక్షన్ను వాడటం వలన సమాన అప్లోడ్ స్పీడ్ని కూడా పొందవచ్చు. 255 MB ఆపరేటింగ్ సిస్టమ్ ఈ స్పీడ్లో 21 సెకన్లలో అప్గ్రేడ్ చేయబడుతుంది. DSL, కాపర్ కేబుల్ లైన్స్ కేవలం 5-10 Mbps వేగాన్ని మాత్రమే కలిగి ఉంటాయి. అందువలన దీనిని ఉపయోగించి 250 MB ఫైల్ను అప్లోడ్ చేసేందుకు దాదాపు 3 నిముషాల సమయం పడుతుంది.
100 Mbps ఫైబర్ కనెక్షన్లో అంతరాయం లేని వర్క్ ఫ్లో అందించబడుతుంది. ఈ స్పీడుతో మీరు మీ బిజినెస్ గోల్స్ను సులభంగా అధిగమించేందుకు ఆస్కారం ఉంటుంది. మీరు అనుకున్న లక్ష్యాలను సాధించడం సులువవుతుంది. వెబినార్లు, ఎంప్లాయ్ ట్రైనింగ్ వీడియోలు సెకన్ల వ్యవధిలో డౌన్లోడ్ అయిపోతాయి.
మంచి డౌన్లోడ్ స్పీడ్ ఎంత అని చాలా మంది ఆశ్చర్యపోతారు. అందుకు మీకు వినిపించే సమాధానం 100 Mbps. కానీ 100 Mbpsలో నెట్ ఎంత వేగంగా ఉంటుంది ?
అసలు mbps (మెగాబిట్ పర్ సెకండ్) అనే పదానికి అర్థం తెలియక చాలా మంది తికమకపడతారు. మెగా బైట్లో ఎనిమిదో భాగాన్ని బైట్ అని పిలుస్తారు. మీకు సులువుగా అర్థమయ్యేలా చెప్పాలంటే, 100MB ఫైల్ను 100 Mbps స్పీడ్ ఉన్న నెట్తో డౌన్లోడ్ చేసినపుడు అది డౌన్లోడ్ కావడానికి 8 సెకండ్ల సమయం మాత్రమే తీసుకుంటుంది. మీరు కేవలం మీ డేటా ట్రాన్స్ఫర్ ప్యాటర్న్స్ను మాత్రమే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా మీకు నెలలో ఎంత డేటా అవసరం ఉంటుందనే విషయంపై అవగాహన కలిగి ఉండాలి.
ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. మీరు ఆన్లైన్ గేమింగ్ను ఆస్వాదిస్తుంటే, బ్రాడ్బ్యాండ్ స్పీడ్ పింగ్ కంటే చాలా తక్కువగా ఉంటుంది. కంప్యూటర్ పరిభాషలో పింగ్ అనే పదాన్ని లేటెన్సీ అని కూడా పిలుస్తారు. స్లోయర్ పింగ్స్ అనగా ఫాస్టర్ ట్రాన్మిషన్ రేటు కలిగి ఉండటం. లేటర్ అనగా ఆన్లైన్ గేమ్ను ఎటువంటి అంతరాయం లేకుండా ఆస్వాదించడం. ఇప్పుడు "25mbps" వేగంగా ఉంటుందని భావించే వారిలో కొత్త ఆలోచనలు వస్తాయి.
చివరగా: ఆధునిక సమాజంలో గృహావసరాల కొరకు 100 Mbps స్పీడ్ చాలా అవసరం.
కాబట్టి, మీకు ఎంత స్పీడ్తో ఇంటర్నెట్ అవసరమని భావిస్తున్నారు? మీరు ఇంటర్నెట్ స్పీడ్ గురించి ఎక్కువగా తెలుసుకోకపోయినా సరే మీకు 100 Mbps స్పీడ్తో నెట్ కనెక్షన్ చాలా అవసరం.
Be Part Of Our Network
All Categories
- BUSINESS INTERNET
- Router
- Internet Security
- Wi-Fi Connection
- Wi-Fi Network
- Internet Broadband
- smartfiber
- Internet Speed
- TV Streaming
- Wifi Connection
- BEST BROADBAND PLANS
- BROADBAND PLANS | 5GHz
- 2.4GHz
- 5GHz frequency
- 5GHz WiFi frequency
- 2.4GHz frequency
- LDRs
- LONG DISTANCE RELATIONSHIP
- ACT Fibernet
- wifi as a service
RECENT ARTICLES
Find the perfect internet plan for you!