WI-FI CONNECTION

మీ వైఫై ఎలా పనిచేస్తుందో ఆశ్చర్యపోతున్నారా.

Wednesday, Jul 06, 2022 · 10 mins

2015

మీ వైఫై ఎలా పనిచేస్తుందో ఆశ్చర్యపోతున్నారా.

Wifi image

వై–ఫై (Wi-Fi) అంటే వైర్​లెస్ LAN. కంప్యూటర్ నెట్​వర్కింగ్​లో ఇదో ఉపయోగకరమైన టెక్నాలజీ. డేటా బదిలీ, కమ్యూనికేషన్ వ్యవస్థను ఇది పూర్తిగా మార్చేసింది. వై–ఫై (Wi-Fi) అనే పదానికి ఎటువంటి అర్థం రాదు కానీ.. లోకల్ ఏరియా వైర్​లెస్ టెక్నాలజీ అనే అర్థం వస్తుంది.

అసలు వైఫై అంటే ఏమిటి? అది ఎలా పని చేస్తుంది?

ఇతర వైర్​లెస్ పరికరాలు పని చేసినట్లే వైఫై కూడా పని చేస్తుంది. రెండు పరికరాల మధ్య సిగ్నల్స్​ను పంపించేందుకు ఇది రేడియో తరంగాలను వాడుకుంటుంది. కానీ ఇక్కడ మాత్రం రేడియో తరంగాలు కార్​ రేడియోలు, వాకీ-టాకీలు, సెల్​ఫోన్లు, వెదర్ రేడియోలు ఉపయోగించే రేడియో తరంగాలకు భిన్నంగా ఉంటాయి. ఇవి వైర్​లెస్ హై స్పీడ్ ఇంటర్​నెట్​ను, నెట్​వర్క్ కనెక్షన్లను అందిస్తాయి. వై–ఫై (Wi-Fi) అనేది ఒక ట్రేడ్​మార్క్ పదం. IEEE 802.11x అని దీనికి అర్థం వస్తుంది.

వై–ఫై (Wi-Fi) ఎలా పని చేస్తుందనే అనుమానం ప్రతి ఒక్కరికీ కలుగుతుంది. ముందుగా కంప్యూటర్ వైర్​లెస్ అడాప్టర్ డేటాను రేడియో సిగ్నల్స్​గా మారుస్తుంది. యాంటెన్నాను ఉపయోగించి సిగ్నల్స్​ను ఇది సులభంగా బదిలీ చేస్తుంది. వైర్​లెస్ రౌటర్ సిగ్నల్స్​ను రిసీవ్ చేసుకుని వాటిని డీకోడ్ చేస్తుంది. వైర్డ్​ ఈథర్​నెట్ కనెక్షన్ ద్వారా రౌటర్ ఇంటర్​నెట్​కు సమాచారాన్ని పంపుతుంది.

వైఫై, ఇంటర్​నెట్​ మధ్య వ్యత్యాసం ఏమిటి?

వై–ఫై (Wi-Fi) అనే పదం ద్వారా వైర్​లెస్ నెట్​వర్క్​లను సూచిస్తారు. పాతరోజుల్లో ఏదైనా పరికరాన్ని నెట్​వర్క్​కు కనెక్ట్ చేసేందుకు లోకల్ ఏరియా నెట్​వర్క్​ను సృష్టించడం ఒక్కటే మార్గంగా ఉండేది. ఇది అసౌకర్యంగా ఉండేది. కానీ వై–ఫై (Wi-Fi) వచ్చిన తర్వాత దీని ద్వారా ఒక పరికరాన్ని వేరే పరికరాలతో కనెక్ట్ చేయడం చాలా సులభమయింది. ఎటువంటి భౌతిక కనెక్షన్ అవసరం లేకుండానే మనం నెట్​వర్క్​ను పొందగలుగుతున్నాం. రౌటర్ అనేది ప్రధానంగా ఈ కనెక్షన్లను నియంత్రిస్తుంది. ఒక పరికరం వేరే పరికరంతో రౌటర్ ద్వారానే కమ్యూనికేట్ (కనెక్ట్​) చేయబడుతుంది.

ఇంటర్​నెట్​ను వైడ్ ఏరియా నెట్​వర్క్ లేదా WAN అని కూడా పిలుస్తారు. అంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంప్యూటర్లను అనుసంధానించే విస్తృత నెట్​వర్క్​. మీ సొంత వైర్​లెస్ నెట్​వర్క్​కు కనెక్ట్ అయిన తర్వాత మీరు అతిపెద్ద గ్లోబల్ నెట్​వర్క్​లో భాగం అవుతారు. దీనినే ఇంటర్​నెట్ అని పిలుస్తారు.

వైఫై కోసం మోడెమ్ కావాలా?

వై–ఫై (Wi-Fi) రౌటర్ మోడెమ్ లేకుండా కూడా పని చేస్తుంది. ఐపీ (IP) అడ్రస్​లతో వై–ఫై (Wi-Fi) కనెక్షన్ అందించేందుకు రౌటర్ ఉంటుంది. దీని వలన మీరు చాలా సులభంగా ఒక కంప్యూటర్ నుంచి మరో కంప్యూటర్​కు ఫైల్స్​ను పంపుకోవచ్చు. మీ ఫోన్​లో ఉన్న వీడియోను టీవీకి లేదా Chromecast కు పంపవచ్చు, ఇంకా ఫైల్స్​ను ప్రింట్ కూడా తీసుకోవచ్చు.

వైఫై రౌటర్, మోడెమ్ మధ్య వ్యత్యాసం ఏమిటి?

ఒకటి కంటే ఎక్కువ నెట్​వర్క్​లను అనుసంధానం చేయడానికి, వాటి మధ్య నెట్​వర్క్ ట్రాఫిక్​ను రూట్ చేసేందుకు రౌటర్ ఉంటుంది. రౌటర్​కు ఇంటర్​నెట్​తో ఒక కనెక్షన్ ఉండాలి, ప్రైవేట్ లోకల్ నెట్​వర్క్​తో ఒక కనెక్షన్ ఉండాలి. చాలా రౌటర్లు బిల్ట్–ఇన్​ స్విచ్​లతో వస్తాయి. దీని వలన అనేక వైర్డ్​ పరికరాలను కనెక్ట్ చేయడంలో సాయపడుతుంది. చాలా రౌటర్లు వైర్​లెస్ రేడియోలతో వస్తాయి. దీని ద్వారా సులభంగా వై–ఫై (Wi-Fi) పరికరాలను కనెక్ట్ చేసుకోవడానికి వీలుంటుంది.

మోడెమ్ అనేది లోకల్ నెట్​వర్క్, ఇంటర్​నెట్ మధ్య ఒక వంతెనలాగ పని చేస్తుంది. డిజిటల్ సమాచారాన్ని ఎన్​కోడ్ చేయడానికి, టెలిఫోన్ లైన్లలో సిగ్నల్స్​ను మాడ్యులేట్ చేయడానికి పాత రోజుల్లో మోడెమ్​లను ఉపయోగించేవారు. ఇంకొక చివరలో డీమాడ్యులేట్ లేదా డీకోడ్ చేయబడ్డాయి. కానీ ప్రస్తుతం వచ్చే ఆధునిక మోడెమ్స్ ఇలా పనిచేయడం లేదు. కనెక్షన్ రకాన్ని బట్టి మోడెమ్ మీ నెట్​వర్క్​కు అటాచ్ చేయబడుతుంది. ఆధునిక మోడెమ్​లు స్టాండర్డ్ ఈథర్​నెట్ కేబుల్ ఔట్​పుట్​ను అందిస్తాయి. మీ ఇంటర్​నెట్ సర్వీస్ ప్రొవైడర్​తో సరిగ్గా కమ్యూనికేట్ చేయడానికి.. సరైన ISP ఇన్​ఫ్రాస్టక్చర్ గల మోడెమ్​లు అవసరం.

నాకు వైఫై ఎందుకు అవసరం? [నెట్​ఫ్లిక్స్ చూసేందుకు నాకు వైఫై కావాలా?]

మీ ఇంట్లో వై–ఫై (Wi-Fi) ని ఏర్పాటు చేయడానికి మీకు వైర్​లెస్ రౌటర్​కు కనెక్ట్​ చేసిన మోడెమ్ కానీ వైర్​లెస్ గేట్​వే కానీ అవసరం. ఇంటర్​నెట్ సర్వీస్ అనేది లేకుండా కూడా వై–ఫై (Wi-Fi) వస్తుంది. ఇతర పరికరాలతో కనెక్ట్ కావడానికి వై–ఫై (Wi-Fi) సిగ్నల్స్​ను అందించే పరికరాలు ఎటువంటి ఇంటర్​నెట్ కనెక్షన్ లేకుండానే నడుస్తాయి.

నెట్​ఫ్లిక్స్ కోసం వై–ఫై (Wi-Fi) తప్పనిసరి కాదు. అందుకోసం ఇంటర్​నెట్ కనెక్షన్​ తప్పనిసరిగా కావాలి. ఏదైనా బ్రాడ్​బ్యాండ్ కనెక్షన్ సాయంతో కూడా మీరు నెట్​ఫ్లిక్స్, వీడియోలను చూసేందుకు ఆస్కారం ఉంటుంది.

రోజురోజుకూ వై–ఫై (Wi-Fi) కి ప్రజాదరణ పెరుగుతోంది. ఇది చాలా సరసమైనది, అనుకూలమైది. అంతేగాక, దీనిని పొందండం కూడా చాలా తేలిక. దీని ద్వారా రెగ్యులర్​గా పనిచేసే పని స్థలం బయట కూడా.. ఇంటర్​నెట్​ పొందేందుకు వీలుంటుంది. మీ వద్ద వై–ఫై (Wi-Fi) ఉంటే నేవిగేషన్ మీ ప్రొడక్టివిటీని ప్రభావితం చేయదు.

మీ వై–ఫై (Wi-Fi) స్పీడును పెంచుకునేందుకు టిప్స్, ట్రిక్స్​ను తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

Read tips and tricks to increase your wifi speed here

  • Share

Be Part Of Our Network

Related Articles

Most Read Articles

PAY BILL

4 easy ways to pay ACT Fibernet bill online

Monday, Dec 04, 2017 · 2 Mins
1464096

WI-FI

Simple Ways to Secure Your Wi-Fi

Wednesday, May 16, 2018 · 10 mins
542013
Read something you liked?

Find the perfect internet plan for you!

Chat How may i help you?