INTERNET

MBPS మరియు MBPS మధ్య తేడా ఏమిటి.

Wednesday, Jul 06, 2022 · 10 mins

921

MBPS మరియు MBPS మధ్య తేడా ఏమిటి.

 

సెకనుకు ఎన్ని మెగాబిట్లు డౌన్లోడ్ అవుతున్నాయో లేదా సెకనుకు ఎన్ని మెగాబైట్లు డౌన్లోడ్ అవుతున్నాయో అనే విషయాల మధ్య గల తేడాను గుర్తించండి. అవి ఫైల్ డౌన్లోడ్ల విషయంలో ఎటువంటి ప్రభావం చూపుతాయో తెలుసుకోండి. ఇంటర్నెట్ గురించి తెలుసుకునేందుకు అనేక రకాల సంక్షిప్త పదాలు ఉన్నాయి. వాటిలో ఏదీ అంత కఠినంగా అనిపించదు. కానీ Mbps, MBpsల మధ్య తేడాను తెలుసుకోవడం చాలా కఠినంగా అనిపిస్తుంది. ఈ రెండింటి మధ్య తేడా ఏంటి? ఈ తేడా అంత పెద్దగా అనిపించదు. కానీ రెండో పదంలో "B" ఉంటుంది. కావున ఇవి రెండు వేర్వేరు పదాలు.

Mbps, MBps మధ్య తేడా ఏమిటి?

బిట్స్ vs బైట్స్ మధ్య తేడాను ఇది స్పష్టంగా సూచిస్తుంది. మొదటి పదం Mbps.. సెకనుకు ఎన్ని మెగాబిట్స్ అనే అర్థం వస్తుంది. ఇందులో ఉండే “b” బిట్స్ను సూచిస్తుంది. అదే సమయంలో రెండో పదం మాత్రం సెకనుకు ఎన్ని మెగా బైట్స్ అనేది తెలియజేస్తుంది. ఇందులో ఉండే క్యాపిటల్ “B” బైట్స్ను సూచిస్తుంది.

– ఈ పదాన్ని డౌన్లోడ్, అప్లోడింగ్ వేగాన్ని సూచించేందుకు వాడతారు. సెకనుకు ఎన్ని మెగాబిట్లు (Mbps) డౌన్లోడ్ లేదా అప్లోడ్ అవుతుందో ఇది సూచిస్తుంది.

– మెగాబైట్స్ అనే పదాన్ని డౌన్లోడింగ్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. సెకనుకు ఎన్ని మెగా బైట్ల (MBps) డేటా డౌన్లోడ్ అవుతుందనేది దీనితో సూచిస్తారు.

సెకనుకు మెగాబిట్స్ (Mbps), సెకనుకు మెగాబైట్స్ (MBps) ఆన్లైన్ యాక్టివిటీలను ఎలా ప్రభావితం చేస్తాయి?

ఇంతకు ముందు మనం చర్చించుకున్న విధంగా ఇంటర్నెట్ నుంచి ఏదైనా ఫైల్స్ను అప్లోడ్ చేస్తున్నపుడు Mbps మరియు MBps అనే రెండు రకాల అంశాలు తెరమీదకు వస్తాయి. మనం ఏదైనా కంటెంట్ను లోడ్ చేయడం, మ్యూజిక్ కానీ మూవీస్ కానీ డౌన్లోడ్ చేయడం, లైవ్ టీవీ చూడటం మొదలైనవి మన ఇంటర్నెట్ స్పీడ్ మీద ఆధారపడి ఉంటాయి. ఒక ఫైల్ డౌన్లోడ్ చేయడానికి ఎంత సమయం పడుతుందనేది ఆ ఫైల్ పరిమాణంతో పాటుగా మన ఇంటర్నెట్ కనెక్షన్ ఎంత స్పీడ్గా ఉందనే విషయాలపై ఆధారపడి ఉంటుంది. మీరు కనుక ఈథర్నెట్ కేబుల్ లేదా వై–ఫై ద్వారా డౌన్లోడ్ చేస్తే ఇతర అంశాలు మీ డౌన్లోడ్ సమయాన్ని ప్రభావితం చేయొచ్చు. మీకు మంచి Mbps కనెక్షన్ ఉన్నా కానీ నాసిరకమైన ఇంటర్నెట్ ఉందా? మీరు మంచి డౌన్లోడ్ స్పీడ్ను కలిగి ఉన్నా కానీ గేమింగ్, వీడియో చాటింగ్ వంటి విషయాలలో సమస్యలు ఎదుర్కొంటున్నారా. ఇటువంటివి లేటెన్సీ వలన చోటు చేసుకుంటాయి. బ్యాండ్విడ్త్ వలన కాదు.

విభిన్న వేగాలతో కింది మీడియా ఫైల్స్ను డౌన్లోడ్ చేసుకునేందుకు పట్టే సమయం...

మీడియా

వెబ్పేజీ

MP3 సాంగ్

10 నిమిషాల SD వీడియో క్లిప్

SD మూవీ

HD మూవీ

ఫైల్ సైజ్

1 MB

3 MB

500 MB

2 GB

12 GB

1 Mbps

8 సెకన్లు

25 సెకన్లు

1 గంట, 10 నిమిషాలు

4 గంటల, 46 నిమిషాలు

28 గంటల, 38 నిమిషాలు

3 Mbps

2 సెకన్లు

8 సెకన్లు

23 నిమిషాల, 18 సెకన్లు

1 గంట, 35 నిమిషాలు

9 గంటల, 32 నిమిషాలు

5 Mbps

1 సెకన్

5 సెకన్లు

14 నిమిషాలు

57 నిమిషాల, 15 సెకన్లు

5 గంటల, 43 నిమిషాలు

10 Mbps

<1 సెకన్

2 సెకన్లు

7 నిమిషాలు

28 నిమిషాల, 37 సెకన్లు

2 గంటల, 52 నిమిషాలు

30 Mbps

<1 సెకన్

<1 సెకన్

2 నిమిషాల, 19 సెకన్లు

9 నిమిషాల, 32 సెకన్లు

57 నిమిషాల, 15 సెకన్లు

50 Mbps

<1 సెకన్

<1 సెకన్

1 నిమిషం, 23 సెకన్లు

5 నిమిషాల, 43 సెకన్లు

34 నిమిషాల, 21 సెకన్లు

100 Mbps

<1 సెకన్

<1 సెకన్

41 సెకన్

2 నిమిషాల, 51 సెకన్లు

17 నిమిషాల, 10 సెకన్లు

500 Mbps

<1 సెకన్

<1 సెకన్

8 సెకన్లు

34 సెకన్లు

3 నిమిషాల, 26 సెకన్లు

1 Gbps

<1 సెకన్

<1 సెకన్

4 సెకన్లు

17 సెకన్లు

1 నిమిషం, 43 సెకన్లు

  • Share

Be Part Of Our Network

Read something you liked?

Find the perfect internet plan for you!

Chat How may i help you?