LEASED LINE

లీజ్డ్ ఇంటర్నెట్ ప్రాముఖ్యత ఏమిట

Monday, Feb 28, 2022 · 15 mins

930

లీజ్డ్ లైన్ ఇంటర్నెట్ కనెక్షన్ అంటే ఏమిటి?

లీజ్​డ్​ ఇంటర్నెట్ – దీని ప్రాముఖ్యత ఏమిటి?

ప్రస్తుతం అనేక వ్యాపారాలు ఇంటర్నెట్ పై ఆధారపడి పనిచేస్తున్నాయి. బలమైన ఇంటర్నెట్ కనెక్షన్‌తో, ఎస్ఎమ్ఈలు వారికి అనేక అవకాశాలు సృష్టించడానికి అన్వేషణ సాగిస్తున్నాయి. సురక్షితమైన, బలమైన కనెక్షన్ విషయానికి వస్తే, లీజ్​డ్​ ఇంటర్నెట్ గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి.

లీజ్​డ్​ లైన్ కనెక్షన్ అంటే ఏమిటి?

లీజ్​డ్​ లైన్ అంటే రెండు లేదా అంతేకంటే ఎక్కువ ప్రదేశాలను సులభంగా కనెక్ట్​ చేసే ప్రత్యేక కమ్యూనికేషన్ ఛానెల్. వాస్తవానికి, ఇది ప్రొవైడర్, కస్టమర్ మధ్య ఒక సర్వీస్ కాంట్రాక్ట్. ఈ ప్రత్యేక లైన్ ఒక పాయింట్ నుంచి ఇంకొక దానికి స్థిరమైన నెలవారీ ధరకు నిరంతర డేటా ఫ్లో ఉండేలా నిర్ధారిస్తుంది. లీజ్​డ్​ లైన్ వినియోగం డేటా, ఇంటర్నెట్, టెలిఫోన్ సర్వీసులలో ప్రాచుర్యం పొందింది. హై-క్వాలిటీ బ్యాండ్ విడ్త్, వేగాన్ని అందించడానికి లీజ్​డ్​ లైన్ కనెక్షన్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్ పై ఆధారపడుతుంది.

సాధారణంగా, లీజ్​డ్​ లైన్ ఈ కింద వాటికి ఉపయోగపడుతుంది-

·  ఫోన్ కాల్స్ చేయడానికి

·  వేర్వేరు ఆఫీసులలో ఉన్న సర్వర్లు, కంప్యూటర్లను లింక్ చేయడానికి

·  ఇంటర్నెట్​కి అనుసంధానించడానికి

·  సిబ్బంది ఇంటి నుంచే వారి కంప్యూటర్లతో పనిచేసేలా వీలు కల్పిచడానికి

 

ఫైబర్ లీజ్​డ్​ లైన్ అంటే ఏమిటి? దాని ప్రయోజనాలు ఏమిటి?

లీజ్​డ్​ లైన్​ను ఫైబర్ లీజ్​డ్​ లైన్ అని కూడా పిలుస్తారు. ఇది నేరుగా ఆవరణ (ఆఫీసు)కు కనెక్ట్ చేసే ప్రత్యేక ఫైబర్-ఆప్టిక్ సర్వీస్. లీజ్​డ్​ లైన్​ను నేరుగా ప్రత్యేక ఫైబర్ ఆప్టిక్ కేబుల్ ద్వారా పబ్లిక్ ఇంటర్నెట్​కు కనెక్ట్ చేయవచ్చు. ఇక్కడ మీరు మౌలిక సదుపాయాలను పంచుకోవాల్సిన అవసరం లేదు. ఫైబర్ లీజ్​డ్​ లైన్ ఉద్దేశం కేవలం మీకు సేవలు అందించడమే. ఇది ఏ ఇతరులు లేదా యూజర్లతో పంచుకోబడదు. ఈ లీజ్​డ్​ లైన్ వేగం 2 ఎంబీపీఎస్ నుంచి 10 జీబీపీఎస్ వరకు ఉంటుంది.

ఫైబర్ లీజ్​డ్​ లైన్ ప్రయోజనాలు-

·  వేగవంతమైన కనెక్షన్ స్పీడ్

·  క్లౌడ్ కంప్యూటింగ్​కి సులభమైన యాక్సెస్

·  బలమైన సిగ్నల్

·  తక్కువ లేటెన్సీ

·  సిమ్మెట్రికల్ స్పీడ్

·  అధిక సెక్యూరిటీ

·  తక్కువ ధర

·  హెచ్‌డీ వీడియో సామర్ధ్యం

 

ప్రత్యేక లైన్, లీజ్​డ్​ లైన్, బ్రాడ్‌బ్యాండ్, ఈథర్‌నెట్, ఏడీఎస్ఎల్, ఎంపీఎల్ఎస్, వీపీఎన్​ల మధ్య తేడా ఏంటి?

లీజ్​డ్​ లైన్స్ సాధారణంగా భౌతికమైనవి. వీపీఎన్‌లు వివిధ నెట్‌వర్క్ లేయర్లలో ఇవ్వబడతాయి. ఎంపీఎల్ఎస్ నెట్‌వర్క్ ట్రాఫిక్ రూటింగ్ సెట్టింగ్. దీన్ని వీపీఎన్ సర్వీసులు అందించడానికి కూడా ఉపయోగించవచ్చు.

 

లీజ్​డ్​ లైన్ పొందడం ఖరీదైన విషయం. వీపీఎన్‌లు కూడా ఖర్చుతో కూడుకున్నవి, అనేక ఆప్షన్లలో వస్తాయి. మరోవైపు, ఎంపీఎల్ఎస్ ఐపీ- ఆధారిత రూటింగ్ కంటే ఎక్కువ సామర్థ్యాన్ని అందిస్తుంది.

 

Leased lines are truly and strongly secure. VPNs are the least secure options. MPLS offers a medium-security as it has no inherent encryption.

లీజ్​డ్​ లైన్స్ వాస్తవంగా చాలా బలంగా సురక్షితంగా ఉంటాయి. వీపీఎన్‌లు అతి తక్కువ సురక్షితమైన ఆప్షన్లు. ఎంపీఎల్ఎస్​కి స్వీయ ఎన్​క్రిప్షన్ లేనందున ఓ మోస్తరు భద్రత మాత్రమే అందిస్తుంది.

లీజ్​డ్​ లైన్ ఫిక్స్​డ్​ బ్యాండ్‌విడ్త్, ఆకట్టుకునే 'అప్‌లోడ్, డౌన్‌లోడ్' వేగాలను అందిస్తుంది. ఇది ఇతర యూజర్లతో కనెక్ట్ అయ్యే అవకాశం ఉండదు. బ్రాడ్‌బ్యాండ్ ప్రత్యేక కనెక్షన్ కాదు. బ్రాడ్‌బ్యాండ్ వేరియబుల్ బ్యాండ్‌విడ్త్ తో వస్తుంది. ఇతర యూజర్లతో కనెక్ట్ అవుతుంది .

 

లీజ్​డ్​ లైన్ ఎలా పనిచేస్తుంది, ఇది ఎందుకు అవసరం?

ఫైబర్ ఆప్టిక్ లీజ్​డ్​ లైన్ లైట్ పల్సెస్ పంపడం ద్వారా పనిచేస్తుంది. ప్రసారమైన డేటా కాంతి వేగంతో ప్రయాణిస్తుంది. లీజ్​డ్​ లైన్ కనెక్షన్ వాస్తవానికి సర్వీస్ ప్రొవైడర్, యూజర్ మధ్య ఒక కాంట్రాక్ట్. ప్రొవైడర్ ఒక సిమ్మెట్రిక్ లేదా బైడైరెక్షనల్ టెలికమ్యూనికేషన్ లైన్ అందిస్తారు. ఇది వార్షిక, త్రైమాసిక లేదా నెలవారీ అద్దెకు బదులుగా రెండు లేదా అంతకంటే ఎక్కువ ప్రదేశాలను కనెక్ట్ చేస్తుంది.

 

బిజినెస్ అప్లికేషన్లు, ఇతర ప్రక్రియలను మెరుగుపరచడానికి స్థిరమైన, బలమైన ఇంటర్నెట్ స్పీడ్ అవసరమయ్యే బిజినెస్‌లు లీజ్​డ్​ కనెక్షన్‌ తీసుకోవచ్చు.

 

కొన్ని బిజినెస్‌లు డేటాను డెలివర్ చేయడానికి, ఆఫీస్ అప్లికేషన్‌లను యాక్సెస్ చేయడానికి రిమోట్ లేదా టెలికమ్యూట్ ఉద్యోగులపైన కూడా ఆధారపడతాయి. వాళ్ళు ఈ కనెక్షన్‌ తీసుకోవచ్చు.

ఎన్ని రకాల లీజ్​డ్​ లైన్స్ ఉన్నాయి?

ప్రదేశము-నుంచి-ప్రదేశము డేటా కనెక్టివిటీ, ప్రదేశము-నుంచి-నెట్‌వర్క్ కనెక్టివిటీ- ఈ రెండూ ప్రస్తుతం అందుబాటులో ఉన్న విశ్వసనీయ, ప్రముఖ లీజ్​డ్​ లైన్ రకాలు.

 

బ్రాడ్‌బ్యాండ్ లేదా లీజ్​డ్​ లైన్లలో ఏది ఉత్తమం?

ఇది అవసరం, బడ్జెట్‌పై ఆధారపడి ఉంటుంది. మీకు అధిక సెక్యూరిటీతో హై-స్పీడ్ కనెక్షన్ అవసరమై, కనెక్షన్‌ను షేర్ చేయాలని అనుకోకపోతే, లీజ్​డ్​ లైన్‌ను ఎంచుకోవడం ఉత్తమ ఆప్షన్​. అనేక కార్పొరేట్ ఆఫీసులు వారి పనితీరు, భద్రతను మెరుగుపరచడానికి ఈ కనెక్షన్ సహాయాన్ని తీసుకుంటున్నాయి. మరోవైపు, బ్రాడ్‌బ్యాండ్ ప్రత్యేకమైన కనెక్షన్ కాదు. ఇది వేరియబుల్ బ్యాండ్‌విడ్త్, అసిమ్మెట్రిక్​. అంటే ఇది అప్‌లోడ్‌ల కంటే వేగంగా డౌన్‌లోడ్‌ అందిస్తుంది. ఇంకా ఇక్కడ మీరు కనెక్షన్‌ని ఇతరులతో పంచుకోవలసి ఉంటుంది. బడ్జెట్ మీ ప్రధాన సమస్య కాకపోతే, మీరు లీజ్​డ్​ లైన్ తీసుకోవచ్చు.

మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఇంటర్నెట్ కనెక్షన్‌ని ఎంచుకునే ముందు, ప్రాథమిక సందేహాలను నివృత్తి చేసుకోవడం ముఖ్యం. ప్రాథమిక సందేహాలన్నీ ఈ బ్లాగ్‌లో చర్చించబడ్డాయి. లీజ్​డ్​ లైన్స్, బ్రాడ్‌బ్యాండ్, వీపీఎన్​లు, అనేక ఇతర ఆప్షన్లు మనకు అందుబాటులో ఉన్నాయి. మరి, చిన్న పరిశోధన అవసరమని తెలుసుకోవడానికి మీకు కావలసిన విషయం ఏమిటి.

  • Share

Be Part Of Our Network

Read something you liked?

Find the perfect internet plan for you!

Chat How may i help you?