మీ బ్రాడ్‌బ్యాండ్ సేవలు క్రమం తప్పకుండా పని చేయకపోయినా.. మీ హోమ్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌లో సమస్యలు ఉన్నా దానికి పలు కారణాలు ఉండవచ్చు. మీ ఇంటర్నెట్ కనెక్ట్ అయిందా లేదా? డిస్‌కనెక్ట్ అయిందా? లేదా స్లోగా ఉందా? అనేది ఎప్పటికీ కనుక్కోవడం చాలా ఇబ్బంది పెడుతుంది. ఎప్పుడైనా వెబ్ పేజీని తెరిచినప్పుడు అది స్పందించకపోతే ఎవరికీ ఇష్టం అనిపించదు. అయితే ఇక్కడో మంచి విషయం ఏంటంటే కొన్ని సులభమైన చిట్కాలు, ట్రిక్స్ సాయంతో సమస్యలను మీరు అర్థం చేసుకోవచ్చు. మీరు సొంతంగా పరిష్కరించుకోవచ్చు. ఆ చిట్కాలు, ఉపాయాలు ఏంటో తెలుసుకోండి.
మీ ఇంటర్నెట్ కనెక్షన్ తరచుగా ఎందుకు కనెక్ట్, డిస్కనెక్ట్ అవుతుంది?
మీ రౌటర్ లేదా ISPలో సమస్య వల్ల ఇంటర్నెట్‌కు తరచుగా అంతరాయం కలగవచ్చు. కనెక్షన్, కంప్యూటర్‌తో సమస్య ఉందో లేదో చూడటానికి వివిధ పరికరాల్లో ఇంటర్నెట్ కనెక్షన్‌ను చెక్ చేయండి. మీ ల్యాప్‌టాప్, మొబైల్, ఫోన్‌కు కనెక్ట్ చేయడానికి ప్రయత్నించండి. అన్ని పరికరాలు మీ నెట్‌వర్క్‌కు లింక్ చేయడంలో సమస్య ఉంటే, అది నెట్‌వర్క్ సమస్య అని మీకు అర్థం అవుతుంది. దీనికి అదనంగా మరికొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
మీ మోడెమ్‌ను చెక్ చేయండి - చాలా ఇంటర్నెట్ కనెక్షన్‌లు సిగ్నల్‌ను అందించడానికి మోడెమ్‌ను ఉపయోగిస్తాయి. ఏదైనా కనెక్ట్ అయ్యి, సరిగ్గా ప్రసారం అవుతుందో లేదో చూపించేందుకు మోడెమ్‌లో లైట్లు ఉండాలి. రీసెట్ చేయడం ద్వారా మోడెమ్‌లో సమస్యను సులువుగా పరిష్కరించవచ్చు. దీన్ని కనీసం రెండు నిమిషాల పాటు ఆఫ్ చేయొచ్చు లేదా అన్‌ప్లగ్ చేయొచ్చు. మీరు దాన్ని తిరిగి ఇంటర్నెట్‌లో ప్లగ్ చేసినప్పుడు లింక్ రీసెట్ అవుతుంది. తద్వారా పునరుద్ధరణ జరిగే అవకాశం ఉంటుంది.
హార్డ్‌వేర్ సమస్యలను పరిగణించండి -
మీ కమ్యూనికేషన్ సమస్యలను పరిష్కరించడానికి పైవి ఏవీ పని చేయకపోతే, మీరు లోపాలున్న రౌటర్ లేదా మోడెమ్ కలిగి ఉండొచ్చు. చాలా ISPలు అదనపు చార్జీ లేకుండా వర్క్ ఎక్విప్మెంట్ కోసం లోపాలున్న పరికరాలతో వ్యాపారం చేసుకునేందుకు వీలు కల్పిస్తాయి. మీ సొంత మోడెమ్ లేదా రౌటర్‌ని కొనుగోలు చేయాలనుకుంటే కొత్తదాన్ని కొనుగోలు చేయడం మంచిది. కొత్తది కొనే ముందు మీ దగ్గర ఉన్న పరికరాలకు వారెంటీ ఉందేమో చూసుకోండి.
మీ ఇంటర్నెట్ ఎందుకు పడిపోతుందని మీరు ఆశ్చర్యపోతున్నారా?
ఇంటర్నెట్ పడిపోవడానికి కిందివి కొన్ని కారణాలు కావచ్చు-
వై-ఫై కనెక్షన్ సమస్యలు
రౌటర్ సమస్యలు
కేబుల్ లేదా హార్డ్‌వేర్ లోపాలు
ఎక్కువగా వైర్‌లెస్ జోక్యం
తరచుగా ఇంటర్నెట్ డిస్‌కనెక్ట్ అవుతుంటే మీరు ఏం చేయొచ్చు?
మోడెమ్లో సాఫ్ట్‌వేర్ సమస్యలను పరిష్కరించాలి
అస్థిరమైన ఇంటర్నెట్ కనెక్షన్‌కు మోడెమ్‌లోని సాఫ్ట్‌వేర్ సమస్యలు ప్రధాన కారణాల్లో ఒకటి. మీరు మోడెమ్, రౌటర్‌ను చాలా కాలంగా వాడుతున్నట్లయితే, వాటిని కొంత సమయం పాటు ఆఫ్ చేసి, ఆపై వాటిని తిరిగి ఆన్ చేయడం వలన కనెక్షన్ స్థిరత్వాన్ని పునరుద్ధరించవచ్చు.
మీ రౌటర్ ఫర్మ్‌వేర్‌ను అప్‌డేట్ చేయాలి
మీ రౌటర్ ఫర్మ్‌వేర్ ఎప్పటికప్పుడు అప్టుడేట్ ఉండేలా చూసుకోండి. రౌటర్ను సకాలంలో అప్డేట్ చేస్తే చాలా కనెక్టివిటీ సంబంధ సమస్యలు పరిష్కారం అవుతాయి. మీరు నెట్‌వర్క్ రేంజ్ను విస్తరించడానికి ఎక్స్‌టెండర్ను ఉపయోగిస్తుంటే, ఫర్మ్‌వేర్‌కు కూడా అదే వర్తిస్తుంది. మీ ఇంట్లోని అన్ని నెట్‌వర్కింగ్ పరికరాల్లో ఆటో-అప్‌డేట్‌లను ఆన్ చేయండి.
కాలం చెల్లిన లేదా తెగిన కేబుళ్లను మార్చండి
ఇంటర్నెట్ కనెక్షన్ తగ్గిపోవడానికి దారితీసే మరొక సమస్య కేబులింగ్‌కు సంబంధించి కావచ్చు. మీరు మోడెమ్ నుంచి రౌటర్‌కు కనెక్ట్ చేసిన పాత కేబుళ్లను మార్చేయండి. కనెక్షన్ గట్టిగా ఉందో లేదో చెక్ చేయండి. కేబుల్ లోపల డ్యామేజీని బయటి నుంచి గుర్తించలేం.
PC హార్డ్‌వేర్ సమస్యలను చెక్ చేయండి
కేబుల్‌ను మార్చిన తర్వాత కూడా మీ సమస్య పరిష్కారం కాకపోతే, సమస్య మీ కంప్యూటర్‌లోని నెట్‌వర్క్ అడాప్టర్ది కావచ్చు. మీరు నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేసిన అన్ని పరికరాల్లో లేదా ఒక నిర్దిష్ట కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్‌లో మాత్రమే అటువంటి స్థిరత్వ సమస్యలను ఎదుర్కొంటున్నారా అనేది చూడటం ద్వారా సమస్యను గుర్తించండి. సమస్య ఒక పరికరంలో మాత్రమే ఉంటే, మీరు తప్పనిసరిగా పరికరం యొక్క నెట్‌వర్క్ అడాప్టర్‌ను చెక్ చేయాలి. అటువంటి సందర్భాల్లో తాజా ఫర్మ్‌వేర్‌తో నెట్‌వర్క్ కార్డ్‌ను అప్డేట్ చేస్తే సమస్య పరిష్కారం అవుతుంది.
తక్కువ రద్దీ ఉన్న వైర్‌లెస్ నెట్‌వర్క్‌కు మారండి
వైర్లెస్లో ఎక్కువగా జోక్యం చేసుకోవడం కూడా మరొక సమస్య కావచ్చు. మీరు తక్కువ బ్యాండ్‌విడ్త్‌ను ఎంచుకుంటే, నెట్‌వర్క్‌కు ఒకేసారి చాలా పరికరాలను కనెక్ట్ చేయడం వలన కనెక్షన్ అప్పుడప్పుడూ పడిపోవచ్చు. ముఖ్యంగా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పరికరాలు కంటెంట్‌ను ప్రసారం చేస్తున్నప్పుడు ఇది జరుగుతుంది. అలాంటి సందర్భాల్లో, మీ వినియోగానికి సరిపోయే వేరే ప్లాన్ ఎంచుకోవడం మంచిది. అలాగే, వైర్‌లెస్ పరికరాలకు అంతరాయం కలిగించే వాటిని ఒకసారి ఆఫ్ చేసిన తర్వాత కనెక్షన్ స్థిరత్వాన్ని చెక్ చేసుకోండి.
రౌటర్ రేంజ్ విస్తరించాలి
మీ రౌటర్ కవరేజ్ ఏరియా ఎంత వరకు ఉందో ఓ సారి చెక్ చేయండి. చాలా సమర్థమైన రౌటర్లలో కూడా గరిష్ట రేంజ్కు దగ్గరగా వెళ్లినప్పుడు కూడా కనెక్షన్ సమస్యలు ఉన్నట్టు గమనించొచ్చు.
మీరు ఇంటి నుంచి పని చేస్తున్నప్పుడు పడిపోతున్న ఇంటర్నెట్ విసుగు కలిగిస్తుంది. పైన పేర్కొన్న మార్గాలతో, మీరు సమస్యను వదిలించుకోవచ్చు. కానీ సమస్య కొనసాగితే, నిధానమైన ఇంటర్నెట్ కనెక్షన్‌తో ఇబ్బంది పడకండి. మీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ టెక్నికల్ సపోర్ట్ టీమ్ను సంప్రదించండి. ఇక మీ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌ను సమర్థంగా ఉపయోగించుకోండి.
Be Part Of Our Network
All Categories
- BUSINESS INTERNET
- Router
- Internet Security
- Wi-Fi Connection
- Wi-Fi Network
- Internet Broadband
- smartfiber
- Internet Speed
- TV Streaming
- Wifi Connection
- BEST BROADBAND PLANS
- BROADBAND PLANS | 5GHz
- 2.4GHz
- 5GHz frequency
- 5GHz WiFi frequency
- 2.4GHz frequency
- LDRs
- LONG DISTANCE RELATIONSHIP
- ACT Fibernet
- wifi as a service
RECENT ARTICLES
Find the perfect internet plan for you!